లిటిల్‌ మిరాకిల్‌.. సంచలనం రోజునే

A Little miracle US baby born on 9/11 Weights 9 Pounds 11 Ounces - Sakshi

ఈ మధ్యకాలంలో తమ పిల్లలు పుట్టే తేదీలు వినూత్నంగా, క్రేజీగా ఉండాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దాని కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే దైవ సంకల్పమో లేక యాదృచ్ఛికమో తెలియదు గాని అమెరికాలో ఓ పాప క్రేజీ తేదీన జన్మించింది. అమెరికాకు చెందిన కామెట్రియోన్ మూర్ బ్రౌన్ ఈ నెల 11న(సెప్టెంబర్‌ 11) పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.  ఆమె ప్రసవించిన సమయం కూడా రాత్రి 9.11 గంటలకు. అంతేకాదు ఆ చిన్నారి బరువు కూడా 9 పౌండ్ల 11 ఔన్సులు. డాక్టర్‌ ఈ అంకెలు చెప్పగానే ఆ చిన్నారి తల్లిదండ్రులు తొలుత ఆశ్చర్యపోయారు. అనంతరం చరిత్రలో మర్చిపోలేని రోజున తమ పాప జన్మించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.   

సెప్టెంబర్ 11 ఈ పేరు వినగానే అమెరికన్లు కలలో కూడా ఉలిక్కిపడతారు. ప్రపంచం మొత్తం గజగజా వణికిపోతారు. అమెరికా చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే పెను విషాదం అదే రోజున చోటు చేసుకుంది. అమెరికా ఆర్థిక శక్తికి సూచికగా చెప్పుకునే వరల్డ్ ట్రేడ్ సెంటర్‌‌పై ఉగ్రదాడి జరిగింది సెప్టెంబర్‌ 11నే. అందుకే 9/11ను అమెరికన్లు మర్చిపోలేరు. సరిగ్గా ఆ సంఘటన జరిగి 18 ఏళ్లు పూర్తయిన రోజునే క్రిస్టినా బ్రౌన్‌ జన్మించింది. దీనిపై ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘లిటిల్‌ మిరాకిల్‌’ అంటూ తెగ సంబరపడిపోతున్నారు. 
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top