రూ. 473 కోట్ల విలువైన ఆభరణాల చోరీ | Jewellery Stolen From Tamara Ecclestones London Home | Sakshi
Sakshi News home page

రూ. 473 కోట్ల విలువైన బంగారం చోరీ

Dec 16 2019 5:13 PM | Updated on Dec 16 2019 6:23 PM

Jewellery Stolen From Tamara Ecclestones London Home - Sakshi

50 నిమిషాల్లోనే రూ 473 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దుండగులు మాయం చేశారు.

లండన్‌ : మాజీ ఫార్ములా వన్‌ బాస్‌ బెర్నీ ఎల్‌స్టోన్‌ కుమార్తె తమరా ఎల్‌స్టోన్‌ నివాసం నుంచి రూ 473 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు అదృశ్యమయ్యాయి. పశ్చిమ లండన్‌లోని ఎల్‌స్టోన్‌ నివాసంలో 50 నిమిషాలల్లోనే దుండగులు ఈ భారీ చోరీకి తెగబడ్డారు. ముగ్గురు దోపిడీదారులు శుక్రవారం రాత్రి సెక్యూరిటీ గార్డుల కళ్లుకప్పి ఆమె పడక గదిలో ఉన్న లాకర్ల నుంచి విలువైన బంగారు, వజ్రాభరణాలను దోచుకువెళ్లారని ది సన్‌ పత్రిక వెల్లడించింది. బ్రిటన్‌లో ప్రముఖ మోడల్‌, సెలబ్రిటీగా ప్రాచుర్యం పొందిన ఎల్‌స్టోన్‌ దోపిడీ జరిగిన సమయంలో క్రిస్‌మస్‌ సెలవల సందర్భంగా దేశం వీడివెళ్లారని ఆ కథనం వెల్లడించింది. ఈ భారీ దోపిడీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement