100 ఏళ్ల క్రితం చనిపోయి.. మళ్లీ పుట్టాడు | James reborn as edward | Sakshi
Sakshi News home page

100 ఏళ్ల క్రితం చనిపోయి.. మళ్లీ పుట్టాడు

Feb 16 2016 2:52 AM | Updated on Sep 3 2017 5:42 PM

100 ఏళ్ల క్రితం చనిపోయి.. మళ్లీ పుట్టాడు

100 ఏళ్ల క్రితం చనిపోయి.. మళ్లీ పుట్టాడు

అతనికిప్పుడు నాలుగేళ్లు.. కానీ, వందేళ్ల క్రితమే అతను చనిపోయాడు..

అతనికిప్పుడు నాలుగేళ్లు.. కానీ, వందేళ్ల క్రితమే అతను చనిపోయాడు..  ఇప్పుడు సెకండ్‌లైఫ్ స్టార్ట్ చేశాడు... నిజం.. యూరప్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో అతను రెండోసారి జీవిస్తున్నాడు.

 అతని పేరు ఎడ్వర్డ్..  తల్లి కడుపులో పుట్టడానికి ముందే అతను జీవించాడు. వందేళ్ల క్రితం వీరుడిగా బతికాడు. మొదటి ప్రపంచ సంగ్రామంలో ఫ్రెంచి సైన్యాలకు బాసటగా నిలిచి వీరమరణం పొందాడు. ఇప్పుడు మళ్లీ జీవిస్తున్నాడు. ఇదేమీ కట్టుకథ కాదు.. నిజం. నాలుగేళ్ల బాలుడు తన పూర్వ జన్మ గురించి చెప్తున్న వాస్తవం.. తల్లిదండ్రులకు.. వైద్యులకు సైతం విస్మయం కలిగించే విచిత్రకథ.

 ఎడ్వర్డ్ ఆస్ట్రియన్ అనే ఈ నాలుగేళ్ల  పిల్లాడికి గొంతులో ఏదో సమస్య రావటంతో అతని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి అతని గొంతులో ఒక గడ్డ ఉందని, దానిచుట్టూ టాన్సిల్స్ ఉన్నాయని తేల్చారు. ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చాక తల్లి ప్యాట్రీషియా అతను అతి కష్టం మీద అన్న మాట.. ‘నాకు బుల్లెట్ తగిలింది’! అని.. మొదట ప్యాట్రీషియా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. డాక్టర్లు శస్త్రచికిత్స చేయడానికి తేదీ నిర్ణయించారు. మొదటి దశలో గడ్డ చుట్టూ ఉన్న టాన్సిల్స్‌ను తొలగించారు. గొంతు లోని ఇబ్బంది కొంచెం తొలగడంతో ఎడ్వర్డ్ ఒక రోజు అమ్మా నీతో మాట్లాడాలి అన్నాడు. ఈ మాటతో ప్యాట్రీషియాలో ఆనందం మొదలైంది. కానీ ఎడ్వర్డ్ మాటలు విన్నాక భయం, ఆశ్చర్యం ఆమెను వెంటాడాయి.

 2015 - 1915...

 ‘‘మీరు అనుకుంటున్నట్టుగా నా పేరు ఎడ్వర్డ్ కాదు.. జేమ్స్! ఫ్రాన్స్‌లోని మారుమూల పల్లెటూరు మాది. మొదటి ప్రపంచ యుద్ధం మొదలవ్వడంతో కుర్రాళ్లందరిలాగే సైన్యంలో చేరాను. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. నేను మరణించిన రోజు, ప్రదేశం నాకింకా గుర్తున్నాయి. ఆ ప్రదేశమంతా దట్టమైన చెట్లతో నిండి ఉంది. అక్కడి వాతావరణం కూడా వాన పడుతూ అసౌకర్యంగా ఉంది.  నా చుట్టూ చాలా మంది సైనికులున్నారు. ఒక్కసారిగా శత్రుసైన్యం మాపై ఒక్కసారిగా విరుచుకుపడింది. ఒక బుల్లెట్ వేరే సైనికుడికి తగిలి అతని శరీరంలోంచి బయటకు వచ్చి నా గొంతులో దిగింది. నేను మరణించాను అన్నాడు ఎడ్వర్డ్. ఈ కథ విన్న ప్యాట్రీషియా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. అంతే కాదు.. రెండో దశలో టాన్సిల్స్ మధ్యలో ఉన్న గడ్డను తొలగించే ఆపరేషన్ కోసం ఆసుపత్రికి తీసుకువచ్చిన ఎడ్వర్డ్ ను పరీక్షించిన వైద్యులకు మరోషాక్. అతని గొంతులోని గడ్డ మాయమైంది. ఇది సహజంగా మాయమయ్యేది కాదని.. ఎలా జరిగిందో అర్థం కావటం లేదని వైద్యులే అవాక్కయ్యారు. పునర్జన్మ గురించి కథలు వినడమే కానీ.. ఎడ్వర్డ్ చెప్పిన కథనం మరింత ఆసక్తికరంగా మారింది.    - సాక్షి, సెంట్రల్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement