ఖతర్నాక్ కొలను.. | It is the world's most spectacular pool | Sakshi
Sakshi News home page

ఖతర్నాక్ కొలను..

Sep 30 2014 1:58 AM | Updated on Sep 2 2017 2:07 PM

ఖతర్నాక్ కొలను..

ఖతర్నాక్ కొలను..

ఇది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన.. అదే సమయంలో ప్రమాదకరమైన సహజసిద్ధ ఈతకొలను. పేరు డెవిల్స్ పూల్.

ఇది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన.. అదే సమయంలో ప్రమాదకరమైన సహజసిద్ధ ఈతకొలను. పేరు డెవిల్స్ పూల్.  జాంబియాలోని ప్రఖ్యాత విక్టోరియా జలపాతాన్ని అనుకునే ఇది ఉంటుంది. జలపాతం అంచున కొంచెం లోతుగా ఉండటంతో అక్కడ సహజసిద్ధమైన ఈతకొలను ఏర్పడింది. ఈ స్విమ్మింగ్ పూల్‌లో అడుగు పెట్టాలంటే.. ధైర్యం కావాల్సిందే. అన్ని సమయాల్లో ఇందులో దిగుదామంటే కుదరదు.. ఎండాకాలం టైమ్‌లో నీళ్లు తక్కువుంటాయి కాబట్టి దిగొచ్చు. ఆ సమయంలో నీటి ఉధృతి తక్కువగా ఉంటుంది. చుట్టూ స్విమ్మింగ్ పూల్ తరహాలో అంచు ఉండటంతో కొంచెం వరకూ పరవాలేదు.

నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇందులోకి ప్రవేశం నిషిద్ధం. ఎందుకంటే.. నీటి ఉధృతికి ఆ అంచు కూడా మనల్ని కాపాడలేదు. కొట్టుకుపోవడమే. నీళ్లు తక్కువున్నప్పుడు మాత్రం అత్యంత అద్భుతమైన అనుభూతిని మనం సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ అంచు వద్దకు వెళ్లిచూస్తే.. 355 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు కిందకు పడుతున్న దృశ్యం మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement