ఆస్ట్రేలియాలో ఐఎస్‌ ఉగ్రదాడి | Islamic State claims Melbourne attack | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో ఐఎస్‌ ఉగ్రదాడి

Nov 10 2018 4:27 AM | Updated on Nov 10 2018 4:27 AM

Islamic State claims Melbourne attack - Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాది రెచ్చిపోయాడు. కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడాలని వేసిన ప్రణాళిక విఫలం కావడంతో పాదచారులపై కత్తితో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో ఆ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ విషయమై విక్టోరియా రాష్ట్ర పోలీస్‌ చీఫ్‌ కమిషనర్‌ గ్రాహమ్‌ ఆస్టన్‌ మాట్లాడుతూ..‘ఈ ఘటనను ఉగ్రదాడిగానే పరిగణిస్తున్నాం. నిందితుడు(31) సోమాలియా నుంచి వచ్చి మెల్‌బోర్న్‌లో నివాసం ఉంటున్నాడు. రద్దీగా ఉండే బౌర్కే వీధిలోకి వచ్చిన నిందితుడు శుక్రవారం కారులోని గ్యాస్‌సిలిండర్లను పేల్చుకుని ఆత్మహుతిదాడి చేయాలనుకున్నాడు. అయితే సిలిండర్లకు మంటలు ముందుగానే అంటుకోవడంతో బయటకొచ్చి కత్తితో దాడిచేశాడు’ అని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement