విమానాన్ని మేమే కూల్చేశాం: ఇరాన్‌

Iran Says Human Error Leads To Ukrainian Boeing Plane Crash Regrets - Sakshi

టెహ్రాన్‌: ఉక్రెయిన్‌ విమానాన్ని తామే కూల్చివేశామని ఇరాన్‌ అంగీకరించింది. మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. బాధితుల కుటుంబాలు తమను క్షమించాలని అభ్యర్థించింది. ఘటనకు కారణమైన వారిపై దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు... ‘ఇది విషాదకరమైన రోజు. అమెరికా సాహసోపేత చర్యల వల్ల తలెత్తిన సంక్షోభంలో మానవ తప్పిదం వల్ల ఈ దుర్ఘటన సంభవించిందని.. మా సైన్యం జరిపిన అంతర్గత విచారణలో ప్రాథమికంగా తేలింది. ఇందుకు పశ్చాత్తాపపడుతున్నాం. బాధితుల కుటుంబాలు, వారి దేశ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాం. తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం’ అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావేద్‌​ జరీఫ్‌ ట్వీట్‌ చేశారు. 

కాగా ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్‌ విమానం బుధవారం ఉదయం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 176 మంది(82 మంది ఇరానియన్లు, 11 ఉక్రెయిన్‌ పౌరులు, 10 మంది స్వీడిష్‌ పౌరులు, నలుగురు ఆఫ్గన్లు, ముగ్గురు జర్మన్లు, ముగ్గురు బ్రిటన్‌ పౌరులు. 63 మంది కెనడియన్లు) మరణించారు.(176 మంది మృతి; కెనడాకు ఇరాన్‌ విఙ్ఞప్తి!)

ఈ నేపథ్యంలో ఇరాన్‌ జనరల్‌ ఖాసిం సులేమాని మృతికి ప్రతీకారంగా ఇరాన్‌.. ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు ప్రయోగించిన క్రమంలో ఈ దుర్ఘుటన జరిగిందని పాశ్చాత్య దేశాలు సందేహాలు వ్యక్తం చేశాయి. దీంతో విచారణకు ఆదేశించినట్లు ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే తొలుత విమానంలో సమస్య తలెత్తడంతో తిరిగి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించగా ప్రమాదం జరిగిందని ఇరాన్‌ తెలిపింది.  ఈ క్రమంలో విమానంపై క్షిపణి దాడి జరిగినట్లు ఉన్న ఈ వీడియో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. క్షిపణి దాడి తర్వాతే విమానం కుప్పకూలినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో దాడికి బాధ్యత వహిస్తూ ఇరాన్‌ ప్రకటన చేయడం గమనార్హం.(వైరల్‌ : విమానాన్ని కూల్చిన ఇరాన్‌ మిస్సైల్‌..!)

క్షిపణి వల్లే కూలింది..!

దద్దరిల్లుతున్న ఇరాక్‌.. మరో రాకెట్‌ దాడి

ఆ దేశాల మీదుగా వెళ్లేటప్పుడు జాగ్రత్త!!

80 మంది చచ్చారు.. ఇంకా 100 లక్ష్యాలు! 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top