సారీ చెప్పినా.. విచారణ ఎదుర్కోవాల్సిందేనా

Indian Origin Chef Atul Kochhar May Be Prosecuted For His Comments - Sakshi

దుబాయ్‌ : క్షణకాలంలో తీసుకునే నిర్ణయాలకు ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. దుబాయ్‌లోని ప్రముఖ జేడబ్ల్యూ మారియట్‌ మార్కిస్‌ హోటల్‌లో చీఫ్‌ చెఫ్‌గా పని చేస్తున్న భారత సంతతికి చెందిన అతుల్‌ కొచ్చర్‌ ఇప్పడు అదే పరిస్థతిని ఎదుర్కొంటున్నాడు. ఆనందంగా సాగుతున్న అతని జీవితంలో ఓ ట్వీట్‌ పెద్ద దుమారమే లేపింది. ప్రియాంక చోప్రా క్వాంటికో సీరియల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్‌ చేసిన అతడు విమర్శల పాలయ్యాడు. తన తప్పును గ్రహించి క్షమాపణలు చెప్పినప్పటికి.. లాభం లేకుండా పోయింది. హోటల్‌ యాజమాన్యం కూడా ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని తెలిపింది. అతుల్‌ ట్వీట్‌పై మండిపడిన కొందరు అతన్ని కాల్చిపడేస్తామని కూడా హెచ్చరించారు.

వీటన్నింటిపై అతుల్‌ సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నాడు. తాను ఇస్లాంకు వ్యతిరేకం కాదని.. తాను పనిచేసే చోట చాలా సంస్కృతుల వారు ఉంటారని.. ఏదో క్షణికావేశంలో ఆ పోస్ట్‌ పెట్టానని.. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమాపణల కోరుతున్నానని ట్వీట్‌ చేశాడు. కాగా స్థానిక మీడియా మాత్రం అతుల్‌ క్షమాపణలు చెప్పినప్పటికి విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని పేర్కొంది. అన్‌లైన్‌ దూషణలకు పాల్పడిన, ముఖ్యంగా ఇస్లాంకు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేసిన దాని తీవ్ర నేరంగా పరిగణిస్తారని.. చట్ట ప్రకారం అతుల్‌కు పదిలక్షల దినార్‌ల జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top