బొమ్మలు గీసే మరబొమ్మ

Humanoid Robot Paints Exhibition In Oxford University - Sakshi

లండన్‌ : మామూలుగా మనషులు లేదా జంతువులు గీసిన బొమ్మలను ఎగ్జిబిషన్‌కు ఉంచటం చూసుంటాము. కానీ ఓ మరబొమ్మ తన స్వహస్తాలతో గీసిన బొమ్మలను ప్రదర్శనకు ఉంచనున్నారు. ఆయిదా అనే హ్యూమనాయిడ్‌ రోబోట్‌ గీసిన బొమ్మలను ఇంగ్లాండ్‌లోని ‘‘ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ’’లో జూన్‌ 12వ తేదీ ప్రదర్శనకు ఉంచనున్నారు.  డ్రాయింగ్‌, పేయింటింగ్‌, వీడియో ఆర్ట్‌ వంటి వాటిని ఈ ప్రదర్శనలో చూడవచ్చు.  ఈ రోబో ఏఐ టెక్నాలజీ, అల్గారిథమ్‌ల సహాయంతో బొమ్మలను వేస్తుంది. అచ్చం మనిషిలాగే కంటితో చూస్తూ, చేతితో పెన్సిల్‌ పట్టుకుని మనషుల బొమ్మలను గీస్తుంది. రోబో పనితనాన్ని బట్టి ఏఐ టెన్నాలజీ సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top