
హెచ్-1బీ వీసాలకు ముగింపు పలకాలి: ట్రంప్
హెచ్-1బీ వీసాలకు ముగింపు పలకాలని, దీనివల్ల అమెరికన్ల ఉద్యోగ అవకాశాలకు కోత పడుతుందని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
వాషింగ్టన్: హెచ్-1బీ వీసాలకు ముగింపు పలకాలని, దీనివల్ల అమెరికన్ల ఉద్యోగ అవకాశాలకు కోత పడుతుందని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మియామిలో శుక్రవారం జరిగిన రిపబ్లిక న్ అధ్యక్ష అభ్యర్థుల చర్చలో ఆ పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులు హెచ్-1బీ వీసా వ్యవస్థను తప్పుపట్టారు.
‘హెచ్-1బీ వీసా గురించి నాకు బాగా తెలుసు. నిజానికి నేను ఉపయోగించా. దాన్ని ఉపయోగించేందుకు ఇప్పుడు నేను అంగీకరించను. అమెరికా ఉద్యోగులకు అది మంచిదికాదు’ అని ట్రం ప్ చెప్పారు. అమెరికా ఉద్యోగులకు బదులు విదేశీయులను పెట్టుకోవడం అన్యాయమని మరో అభ్యర్థి మార్కో రుబియో చెప్పారు.