హైడ్రామా: ఆత్మహత్యను అడ్డుకున్నారు | Firefighter Walks On Narrow Ledge To Save Suicidal Woman On 15th Floor | Sakshi
Sakshi News home page

హైడ్రామా: ఆత్మహత్యను అడ్డుకున్నారు

Published Tue, May 9 2017 7:49 PM | Last Updated on Thu, Sep 13 2018 5:04 PM

హైడ్రామా: ఆత్మహత్యను అడ్డుకున్నారు - Sakshi

హైడ్రామా: ఆత్మహత్యను అడ్డుకున్నారు

భర్తతో గొడవ పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ మహిళను అధికారులు చాకచక్యంగా రక్షించారు.

న్యూఢిల్లీ: భర్తతో గొడవ పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ మహిళను అధికారులు చాకచక్యంగా రక్షించారు. ఈ ఘటన చైనాలోని అన్హుయ్‌ ప్రావిన్సులో చోటు చేసుకుంది. భర్తతో గొడవపడిన ఓ మహిళ 15 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లింది. ఇది చూసిన కొంతమంది పౌరులు ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించారు.

హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది ఆమెను చాకచక్యంగా రక్షించాలని వ్యూహం రచించారు. అందులో భాగంగా ఓ అధికారి నడుముకు తాడు కట్టుకుని చప్పుడు చేయకుండా నడుచుకుంటూ వెళ్లి.. అంచున ఏడుస్తూ కూర్చున్న ఆమెను ఒక్కసారిగా పట్టుకున్నాడు. అనుకోని సంఘటనతో షాక్‌కు గురైన ఆమె తనను వదిలేయాలని.. చచ్చిపోతానని కేకలు పెట్టింది.

అధికారి ఆమెను పట్టుకోగానే పక్కనే ఉన్న బాల్కని నుంచి వచ్చిన మరో నలుగురు అధికారులు ఆమెను సురక్షితంగా పైకి లాగారు. ఈ దశలో ఆమె చేతి నుంచి సూసైడ్‌ నోట్‌ జారి కింద పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఎంతో ధైర్యంతో మహిళను రక్షింంచిన ఫైర్‌ ఫైటర్‌ను నెటిజెన్లు మెచ్చుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement