చిన్నారిని చావబాది.. తండ్రి ఫేస్'బుక్' అయ్యాడు | Father beats infant, posts photos on Facebook 'for fun' | Sakshi
Sakshi News home page

చిన్నారిని చావబాది.. తండ్రి ఫేస్'బుక్' అయ్యాడు

Aug 1 2014 5:03 PM | Updated on Jul 26 2018 5:21 PM

చిన్నారిని చావబాది.. తండ్రి ఫేస్'బుక్' అయ్యాడు - Sakshi

చిన్నారిని చావబాది.. తండ్రి ఫేస్'బుక్' అయ్యాడు

ఫ్రాన్స్కు చెందిన ఓ వ్యక్తి విచక్షణ లేకుండా తన నెల రోజుల వయసు చిన్నారిని కొట్టాడు.

లండన్: ఫ్రాన్స్కు చెందిన ఓ వ్యక్తి విచక్షణ లేకుండా తన నెల రోజుల వయసు చిన్నారిని కొట్టాడు. ఏదో ఘన కార్యం చేసినట్టుగా చిన్నారి గాయలను చూపుతూ ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇంకేముంది అతగాడు సాక్ష్యాలతో సహా అడ్గంగా దొరికిపోయాడు. అతని స్నేహితుడు ఫేస్బుక్లో ఫొటో చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. చిన్నారి ఏడుపు భరించలేక కొట్టానని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పాడు. ఫొటోను సరదా కోసం ఫేస్బుక్లో ఉంచానని తెలిపాడు. చిన్నారిని తండ్రి కొడుతున్న సమయంలో తల్లి అక్కడే ఉన్నా మౌనంగా ఉండిపోయిందని పోలీసలు తెలిపారు. పోలీసులకు చెబితే భర్త తనను వదిలేస్తాడనే భయంతో చెప్పలేదట. పాపం చిన్నారి గాయాలతో అస్వస్థతకు గురైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement