టెక్సాస్‌కు పర్యావరణ ముప్పు | Environmental threat to Texas | Sakshi
Sakshi News home page

టెక్సాస్‌కు పర్యావరణ ముప్పు

Sep 6 2017 3:36 AM | Updated on Sep 12 2017 1:57 AM

హరికేన్‌ హార్వీ సృష్టించిన అలజడికి కకావికలమైన అమెరికా రాష్ట్రం టెక్సాస్‌కు ఇప్పుడు పర్యావరణ ముప్పు పొంచిఉంది.

60కి చేరిన హరికేన్‌ హార్వీ మృతులు 
 
హూస్టన్‌: హరికేన్‌ హార్వీ సృష్టించిన అలజడికి కకావికలమైన అమెరికా రాష్ట్రం టెక్సాస్‌కు ఇప్పుడు పర్యావరణ ముప్పు పొంచిఉంది. హరికేన్‌ హార్వీ బీభత్సంతో మరణించిన వారి సంఖ్య 60కి చేరింది. మొత్తంగా అమెరికా అర్థిక వ్యవస్థకు హార్వీ కారణంగా సుమారు రూ.11.54 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. కాగా, హరికేన్‌ హార్వీ వల్ల సంభవించిన పర్యవరణ మార్పులతో అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

సురక్షిత ప్రాంతాల నుంచి తమ ఇళ్లకు చేరుకున్న ప్రజలు బాటిల్‌ వాటర్‌నే తాగాలని, సర్జికల్‌ మాస్క్‌లు, కాలివేళ్లను మూసి ఉంచే షూస్, చేతి తొడుగులను వినియోగించాలని సూచించారు. కరీబియన్‌ దీవుల వైపుగా హరికేన్‌ ఇర్మా దూసుకువస్తోందని అమెరికా వాతావరణ విభా గం హెచ్చరించింది. కేటగిరి 4 తీవ్రత గల ఈ హరికేన్‌ ప్రభావం ప్యూర్టోరికో, ఫ్లోరిడా, కరీబియన్‌ దీవులపై ఎక్కువ ఉంటుందని, గంటకు 240 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా పలు విమాన సర్వీసులను రద్దు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement