ట్రంప్‌ ఇఫ్తార్‌ విందు

Donald Trump Attends Ramadan Iftar At White House - Sakshi

వాషింగ్టన్‌: ముస్లింలకు రంజాన్‌ మాసం చాలా ప్రత్యేకమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. వైట్‌హౌస్‌లో సోమవారం రాత్రి అధికారులకు, వివిధ దేశాల దౌత్యవేత్తలకు ఆయన ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్, శ్రీలంక, కాలిఫోర్నియా, పిట్స్‌బర్గ్‌లో జరిగిన ఉగ్రవాద దాడులపై ట్రంప్‌ విచారం వ్యక్తం చేశారు. రంజాన్‌ మాసం కుటుంబాలను, పొరుగువారిని, సమాజాన్ని మరింత చేరువ చేస్తుందని చెప్పారు. రంజాన్‌లో శాంతి, సహనంతో ఉండాలని ప్రజలు కోరుకుంటారని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని, ప్రజలందరూ భయపడకుండా భవగంతున్ని ప్రార్థించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికాలో ప్రజలు కలిసి కట్టుగా, స్వేచ్ఛగా, భద్రతతో జీవిస్తున్నారని ట్రంప్‌ వెల్లడించారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top