కరోనా కలకలం : 2000కు చేరిన మృతుల సంఖ్య

Coronavirus Death Toll In China Increased - Sakshi

బీజింగ్‌ : కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందడం కలవరం కలిగిస్తోంది. కొత్తగా పలు కేసులు వెలుగు చూస్తుండటం మృతుల సంఖ్య 2000కు చేరడం ఆందోళన రేకెత్తిస్తోంది. డెడ్లీ వైరస్‌ మందగించిందనేందుకు తగిన గణాంకాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో మృతుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. హుబేయి ప్రావిన్స్‌లో మృతుల సంఖ్య సోమవారం 93 కాగా మంగళవారం 132కు పెరగడం విశేషం. చైనా వ్యాప్తంగా కరోనా కేసులు ఇప్పటివరకూ 74,000 నమోదు కాగా మరణాల సంఖ్య 2000కు పెరిగిందని అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాప్తి అటు అంతర్జాతీయ వృద్ధి రేటును, కార్పొరేట్ల లాభాలనూ ప్రభావితం చేస్తుండగా చమురు రేట్లు, ఈక్విటీ మార్కెట్లు కుదేలయ్యాయి.

చదవండి : యాపిల్‌కూ ‘వైరస్‌’

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top