అధిక నిద్రతో మేధో వర్ఛస్సు | chronic sleep increases face intelligence | Sakshi
Sakshi News home page

అధిక నిద్రతో మేధో వర్ఛస్సు

Mar 9 2016 7:22 PM | Updated on Sep 3 2017 7:21 PM

రాత్రిపూట కంటినిండా నిద్రిస్తే అలసట మాయం కావడమే కాదు, ముఖంలో మేధస్సు మరింత ఉట్టిపడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

లండన్: రాత్రిపూట కంటినిండా నిద్రిస్తే అలసట మాయం కావడమే కాదు, ముఖంలో మేధస్సు మరింత ఉట్టిపడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. యునెటైడ్ కింగ్‌డమ్‌లోని సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 190 మంది పిన్నలు, పెద్దలపై ఈ మేరకు అధ్యయనం నిర్వహించారు.

టీచర్లకు మంచి తెలివైన విద్యార్థిలా కన్పించాలన్నా, ఇంటర్వ్యూ చేసే వారిపై సానుకూల ప్రభావం చూపించాలన్నా ముందురోజు రాత్రి బాగా నిద్రపోవాలని వారు సూచించారు. వ్యక్తులు ఎంత ఆకర్షణీయంగా ఉన్నారన్న సంగతిని పక్కనపెట్టి, వారి మోములో మేధస్సు ఉట్టిపడానికి ఏంచేయాలనే అంశంపై తాము దృష్టిపెట్టి, అధ్యయనం నిర్వహించినట్లు పరిశోధకులు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement