ఐఫోన్ 6ఎస్ను పోలిన మరో కొత్త ఫోన్! | China-based Meizu has launched its latest flagship smartphone | Sakshi
Sakshi News home page

ఐఫోన్ 6ఎస్ను పోలిన మరో కొత్త ఫోన్!

Apr 13 2016 6:17 PM | Updated on Sep 3 2017 9:51 PM

ఐఫోన్ 6ఎస్ను పోలిన మరో కొత్త ఫోన్!

ఐఫోన్ 6ఎస్ను పోలిన మరో కొత్త ఫోన్!

చైనాకు చెందిన ఫోన్ల తయారీ సంస్థ మీజూ ఐఫోన్ 6ఎస్ను పోలిన ఫోన్ 'ది మీజూ ప్రో 6'ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మరి మీజూ సరికొత్త మొబైల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చుద్దామా..

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఫోన్ల తయారీ సంస్థ మీజూ ఐఫోన్ 6ఎస్ను పోలిన ఫోన్ 'ది మీజూ ప్రో 6'ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఫోన్లో ఇంతవరకు ఏ మొబైల్ కంపెనీ విడుదల చేయని డెకా కోర్ ప్రాసెసర్ను అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. 5.2 అంగుళాల అమోలెడ్ స్క్రీన్తో హెచ్డీ రిజల్యుషన్, 7.2 ఎమ్ఎమ్ మందంతో  ప్రో 6 విడుదలయింది. ఐఫోన్ బాడీ డిజైన్తో తయారైన ఈ ఫోన్లో అతి చిన్న యాంటెనా మాత్రమే మార్పు. ఐఫోన్లో తొలిసారి ప్రవేశపెట్టిన 3డి ప్రెస్ ఆప్షన్ను కూడా ఇందులో ఉంచింది మీజూ. దీంతో స్క్రీన్ మీద ఎక్కువసేపు నొక్కి ఉంచడం వల్ల ఫోన్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలుగుతుంది. 
 
32 జీబీ, 64 జీబీ రెండు వేరియంట్లలో ఈ ఫోన్ను మిజో కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. 21 మెగా పిక్సల్ కెమెరాలో కస్టమ్ లెన్స్ను ఉపయోగించారు. 10 ఎల్ఈడీ ఫ్లాష్ లైట్లను వినియోగించారు. 4జీ సపోర్ట్తో పాటు యూఎస్బీ సీ టైప్ కంపాటబులిటీ ఈ ఫోన్ ప్రత్యేకత. సెక్యురిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఇందుకు అమర్చారు.
 
2,650 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఒక గంటలో ఛార్జ్ అవుతుందని మీజూ ప్రతినిధులు తెలిపారు. నలుపు, సిల్వర్, గోల్డ్ రంగుల్లో మొబైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. 32 జీబీ వేరియంట్ ధర రూ.25,719లు కాగా, 64 జీబీ రూ.28,807లు కంపెనీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement