ఎగిరే కారు.. బాగుంది సారూ.. | California designers reveal flying car powered by jet engine | Sakshi
Sakshi News home page

ఎగిరే కారు.. బాగుంది సారూ..

Jun 6 2014 12:47 AM | Updated on Sep 2 2017 8:21 AM

ఎగిరే కారు.. బాగుంది సారూ..

ఎగిరే కారు.. బాగుంది సారూ..

ఎగిరే కార్లు కొన్ని వచ్చాయి.. మరికొన్ని డిజైన్లు వచ్చాయి. ఇది మాత్రం వాటన్నిటికన్నా స్టైలిష్ అని చెప్పక తప్పదు..

ఎగిరే కార్లు కొన్ని వచ్చాయి.. మరికొన్ని డిజైన్లు వచ్చాయి. ఇది మాత్రం వాటన్నిటికన్నా స్టైలిష్ అని చెప్పక తప్పదు.. హాలీవుడ్ సినిమాలో బ్యాట్‌మాన్ వినియోగించే వాహనంలా ఉన్న ఈ జీఎఫ్ 7 డిజైన్‌ను అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గ్రెగ్ బ్రౌన్, డేవ్‌లు రూపొందించారు. గాలిలోకి ఎగిరేటప్పుడు ఈ కారుకుండే రెక్కలు విచ్చుకుంటాయి.
 
 నేలపై ఎలక్ట్రిక్ మోటార్ల సాయంతో నడిచే ఈ వాహనం.. గాలిలో జెట్ ఇంజిన్ సాయంతో ఎగురుతుంది. గాలిలో ఎగిరేటప్పుడే.. ఇందులోని జెట్ ఇంజిన్ ఎలక్ట్రిక్ మోటార్ల తాలూకు బ్యాటరీని రీచార్జ్ చేస్తుంది. జీఎఫ్ 7 మార్కెట్లోకి రావడానికి మరో నాలుగేళ్ల సమయం పడుతుందని గ్రెగ్, డేవ్‌లు చెబుతున్నారు. నేలపై గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ జీఎఫ్ 7.. ఆకాశంలో 885 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీని ధర రూ.17-30 కోట్ల మధ్య ఉండవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement