ఢాకా కేఫ్ ముట్టడి కేసులో మరో ఇద్దరి అరెస్ట్... | Briton arrested over deadly Bangladesh cafe siege | Sakshi
Sakshi News home page

ఢాకా కేఫ్ ముట్టడి కేసులో మరో ఇద్దరి అరెస్ట్...

Aug 4 2016 6:06 PM | Updated on Aug 20 2018 4:44 PM

ఢాకా కేఫ్ దాడిలో మరో ఇద్దరు అనుమానితుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఢాకాః బంగ్లాదేశ్  రాజధాని ఢాకా కేఫ్ సీజ్ కేసులో మరో ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశీ మూలాలు కలిగిన.. ఓ  బ్రిటిష్ పౌరుడు సహా..   కెనడియన్ యూనివర్శిటీ విద్యార్థి అయిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గతనెల్లో జరిగిన ఢాకా మారణహోమం తో  వారికి సంబంధాలు ఉన్నట్లు అనుమానించిన పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఢాకా కేఫ్ దాడిలో మరో ఇద్దరు అనుమానితుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బంగ్లాదేశీ మూలాలు కలిగిన బ్రిటిష్ పౌరుడు మస్నత్ కరీం తోపాటు... టొరంటో విశ్వవిద్యాలయ విద్యార్థి అయిన  తహ్మింద్ ఖాన్ లను బుధవారం రాత్రి నిర్బంధించినట్లు పోలీస్ ప్రతినిధి ఏకేఎమ్ షహిదుర్ రెహ్మాన్ వెల్లడించారు. ఎవరినైనా నేరస్థులుగా అనుమానించినప్పుడు వినియోగించే చట్టం ఐపీసీ సెక్షన్ 54 క్రింద వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా విదేశీయులు ఉండే హోలీ ఆర్టిజన్ కేఫ్ ను ముష్కరులు ముట్టడించిన సమయంలో జూలై 1వ తేదీ రాత్రి  కరీం, ఖాన్ లు లోపలే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  వారిని బంధించి జరిపిన దాడిలో ఇద్దరు పోలీసులతోపాటు 20 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే కమెండోలు జూలై 2వ తేదీ ఉదయం ఢాకా కేఫ్ పై దండెత్తిన సమయంలో వారు బయట ప్రజలతోపాటు కనిపించినట్లు ఆధారాలనుబట్టి తెలుసుకున్నారు. అయితే కరీం, ఖాన్ లు ఇద్దరూ సెక్యూరిటీ సర్వీసెస్ లో ఉండేవారని, వారికి దాడితో ఎటువంటి సంబంధాలు లేవని వారి కుటుంబ సభ్యులు విచారణలో తెలిపారు.

కాగా  పోలీసులు ఈ వారం మొదట్లో ఢాకా మారణహోమం  ప్రధాన సూత్రధారి బంగ్లాదేశ్ మూలాలు కలిగిన కెనడాకు చెందిన వ్యక్తి తమీమ్ చౌదురిగా గుర్తించారు. అతడికోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి 25,000 డాలర్లు బహుమతిని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యం.. ప్రస్తుత అరెస్టులకు దారి తీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement