‘కారు’చౌక బేరం! | Black Friday: American teenager buys a CAR for just one dollar in amazing deal | Sakshi
Sakshi News home page

‘కారు’చౌక బేరం!

Dec 5 2013 5:49 AM | Updated on Sep 2 2017 1:17 AM

అదృష్టం రెండుసార్లు తలుపు తట్టడం అంటే ఇదే మరి! అమెరికాలో కృతజ్ఞతార్పణల దినోత్సవం(థ్యాంక్స్ గివింగ్ డే) అనంతరం నిర్వహించిన భారీ తగ్గింపు మేళాలో ఓ కుటుంబం కేవలం ఒకే ఒక డాలర్ చొప్పున చెల్లించి రెండు కార్లు సొంతం చేసుకుంది.

హూస్టన్(అమెరికా): అదృష్టం రెండుసార్లు తలుపు తట్టడం అంటే ఇదే మరి! అమెరికాలో కృతజ్ఞతార్పణల దినోత్సవం(థ్యాంక్స్ గివింగ్ డే) అనంతరం నిర్వహించిన భారీ తగ్గింపు మేళాలో ఓ కుటుంబం కేవలం ఒకే ఒక డాలర్ చొప్పున చెల్లించి రెండు కార్లు సొంతం చేసుకుంది. వీరిద్దరూ తల్లీకొడుకులు కావటం మరో విశేషం. ‘బ్లాక్ ఫ్రైడే’ రోజు కారుచౌక విక్రయాలను పురస్కరించుకుని నైరుతి హూస్టన్‌లోని కార్ల విక్రయ కేంద్రం స్టెర్లింగ్ మెక్ కాల్ టయోటా ఎదుట జనం పెద్ద ఎత్తున బారులు తీరి రాత్రంతా జాగారం చేశారు. దాదాపు 200 మంది ఇందులో పాల్గొన్నారు. కొందరైతే తాము ఎంపిక చేసుకున్న వాహనం పక్కనే కునికిపాట్లు పడ్డారు. ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది.
 
రెగినాల్డ్ అనోక్వురు(15)ను తొలుత అదృష్ట లక్ష్మి వరించింది. డాలర్‌కే కారు సొంతమైంది. ఈ ఆనందం నుంచి తేరుకునేలోపే అతడి తల్లికి కూడా ఒక్క డాలర్‌కే కారు దక్కినట్లు తెలియటంతో ఆ కుటుంబం ఉబ్బితబ్బిబ్బైంది. ఈ పిల్లాడికి దక్కిన కారుకు దాదాపుగా అతడి వయసే ఉంది. మొత్తం 300 వాహనాలను ‘బ్లాక్ ఫ్రైడే’లో ప్రదర్శనకు ఉంచగా ఐదు కార్లను మాత్రం డాలర్‌కే విక్రయాలకు పెట్టారు. మిగతా కార్లను బయట మార్కెట్‌లో దొరికే ధరలకే అమ్మారు.

Advertisement
 
Advertisement
Advertisement