ఆ బిలియనీర్‌ బ్లూమ్‌బర్గ్‌ను అమ్మేస్తాడు..

Billionaire Owner Of Bloomberg To Sell His Firm - Sakshi

వాషింగ్టన్‌ : డెమొక్రాట్‌ల నుంచి అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న మైకేల్‌ బ్లూమ్‌బర్గ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష పదవికి ఎన్నికైతే తనను బిలియనీర్‌ను చేసిన బ్లూమ్‌బర్గ్‌ను ఆయన అమ్మేస్తారని మైకేల్‌ ప్రచార ప్రతినిధులు స్పష్టం చేశారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌తో తలపడే డెమొక్రాటిక్‌ నామినేషన్‌కు ఒపీనియన్‌ పోల్స్‌లో అనూహ్యంగా మైకేల్‌ బ్లూమ్‌బర్గ్‌ ముందుకొచ్చారు. లాస్‌వెగాస్‌లో బుధవారం ఆయన తొలి ఎన్నికల ప్రచార చర్చలో పాల్గొంటారు.

అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైతే మైక్‌ తన కంపెనీని విక్రయిస్తారని ఆయన ప్రతినిధి గలియా స్లేన్‌ వెల్లడించారు. వాణిజ్య సమాచారంతో పాటు వార్తలు అందించడంలో బ్లూమ్‌బర్గ్‌ ఎల్‌పీ అత్యంత ప్రజాదరణ పొందిన సంగతి తెలిసిందే. మైకేల్‌ బ్లూమ్‌బర్గ్‌ 1981లో బ్లూమ్‌బర్గ్‌ ఎల్‌పీని ప్రారంభించారు. 2019లో బ్లూమ్‌బర్గ్‌ రాబడి రూ 70,000 కోట్ల పైమాటేనని బర్టన్‌ టేలర్‌ ఇంటర్నేషనల్‌ కన్సల్టింగ్‌కు చెందిన ఓ అనలిస్ట్‌ అంచనా వేశారు.

చదవండి : ట్రేడ్‌ డీల్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top