457 వీసా రద్దు: భారత టెకీలకు బ్యాడ్‌ న్యూస్‌ | Australia abolishes skilled expat workers’ visas popular with Indians | Sakshi
Sakshi News home page

457 వీసా రద్దు: భారత టెకీలకు బ్యాడ్‌ న్యూస్‌

Mar 23 2018 10:04 AM | Updated on Sep 15 2018 8:05 PM

Australia abolishes skilled expat workers’ visas popular with Indians - Sakshi

ఆస్ట్రేలియా 457 వీసా(ఫైల్‌ ఫోటో)

మెల్‌బోర్న్:  హెచ్‌1 బీ వీసాలపై  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్‌ కఠిన వైఖరి ఆందోళన రేకెత్తిస్తుండగా, తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయం భారత టెకీలకు  భారీ షాక్‌ఇచ్చింది.  అమెరికా బాటలో పయనిస్తున్న ఆస్ట్రేలియాలో విదేశీ ఐటినిపుణులకు ఉద్దేశించిన 457వీసాను రద్దు చేసింది.  దీని స్థానంలో ఒక కొత్త తాత్కాలిక నైపుణ్య కొరత (టెంపరరీ స్కిల్‌ షార్టేజ్‌) వీసాను తీసుకు వచ్చింది. మార్చి 18 నుంచి ఈ కొత్త వీసా పద్ధతిని అమలు చేస్తోంది.  ఈ నిర్ణయం భారతీయ ఐటి నిపుణులను భారీగా దెబ్బతీయనుంది.  90వేల మంది విదేశీ ఉద్యోగుల్లో  అత్యధికులు భారతీయులే (22శాతం) కావడం గమనార్హం.

ఆస్ట్రేలియా తాజా నిర్ణయం అక్కడిభారతీయులకు తీవ్ర ఎదురుదెబ్బగా పరిణమించనున్నది. నైపుణ్యం అవసరమైన ఉద్యోగాల్లో అర్హులైన ఆస్ట్రేలియన్లు లేనిపక్షంలో వారి స్థానంలో విదేశీయులను నాలుగేళ్లపాటు వివిధ కంపెనీలు నియమించుకునేందుకు 457 వీసా వీలు కల్పిస్తున్నది. ఇప్పుడు దీనిని రద్దు చేయడంతో అక్కడ శాశ్వత నివాసంకోసం చూస్తున్న భారతీయులకు ఇది నిజంగా చేదువార్త. దేశంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించే క్రమంలో విదేశీయులు ఉపయోగించే వర్క్ వీసాలను రద్దు చేయాలని ఆస్ట్రేలియా  ప్రభుత‍్వం ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement