బాయ్‌ఫ్రెండ్‌ నిర్వాకంతో చిక్కుల్లో ఎయిర్‌హోస్టెస్‌ | Air Hostess Suspended Over Drunk Boyfriends Fight With Pilot | Sakshi
Sakshi News home page

బాయ్‌ఫ్రెండ్‌ నిర్వాకంతో చిక్కుల్లో ఎయిర్‌హోస్టెస్‌

Oct 22 2019 8:08 AM | Updated on Oct 22 2019 10:57 AM

Air Hostess Suspended Over Drunk Boyfriends Fight With Pilot - Sakshi

తాగిన మత్తులో పైలట్‌తో ఘర్షణకు దిగిన బాయ్‌ఫ్రెండ్‌ నిర్వాకం ఓ మహిళ ఉద్యోగం కోల్పోయే పరిస్థితికి దారితీసింది.

లండన్‌ : బాయ్‌ఫ్రెండ్‌ నిర్వాకానికి మహిళ తన ఉద్యోగాన్ని కోల్పోయిన పరిస్థితి ఎదురైంది. పీకల్లోతు మద్యం సేవించి తన బాయ్‌ఫ్రెండ్‌ పైలట్‌తో ఘర్షణకు దిగడంతో ఎయిర్‌హోస్టెస్‌ను బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ సస్పెండ్‌ చేసింది. ప్రయాణంలో భాగంగా సింగపూర్‌ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హోటల్‌లోని రిసెప్షన్‌ ప్రాంతంలో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ పైలట్‌తో ఎయిర్‌హోస్టెస్‌ నటాలీ ఫ్లిండాల్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఘర్షణకు దిగాడని బ్రిటిష్‌ పత్రిక సన్‌ పేర్కొంది. నటాలీ తన బాయ్‌ఫ్రెండ్‌ను వెనుకసీటులో విమాన ప్రయాణాన్ని ఆస్వాదించాలని సూచించగా అతను సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ ఎయిర్‌హోస్టెస్‌ నటాషాను సస్పెండ్‌ చేసింది. తమ సిబ్బంది నుంచి సరైన ప్రవర్తనను ఆశిస్తామని, క్రమశిక్షణను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు చేపడతామని ఎయిర్‌వేస్‌ ప్రతినిధి స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement