నిరసన హింసాత్మకం : 16 మంది మృతి

16 Killed in Israel Forces Attack In Gaza - Sakshi

గాజా, పాలస్తీనా : ఇజ్రాయెల్‌-గాజా సరిహద్దులో పాలస్తీనియన్లు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. పాలస్తీనియన్లు- ఇజ్రాయెల్‌ దళాల మధ్య చెలరేగిన గొడవల్లో 16 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 11 వందల మంది గాయాలపాలయ్యారు. శరణార్థులు తిరిగి ఇజ్రాయెల్‌కు వచ్చే అంశంపై ఆరు వారాల పాటు ఇజ్రాయెల్‌-గాజా సరిహద్దులో నిరసన చేపట్టాలని పాలస్తీనియన్లు పిలుపునిచ్చారు.

ఈ మేరకు భారీ శనివారం నుంచి ప్రారంభమైన నిరసన కార్యక్రమం హింసాత్మకమైంది. ఇజ్రాయెల్‌ నుంచి జెరూసలేంకు అమెరికా ఎంబసీని మార్చనున్నట్లు ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్ ఫొటోలను నిరసనకారులు తగులబెట్టారు. దీంతో 30 వేల మందిపై ఇజ్రాయెల్‌ సైన్యం డ్రోన్లను ఉపయోగించి ఏడుపు వాయువును ప్రయోగించింది.

ఇజ్రాయెల్‌ సరిహద్దులోని ఫెన్సింగ్‌కు హాని కలిగించడం వల్లే ఆందోళనకారులపై కాల్పులు జరిపినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు గాజా ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top