ఈజిప్టులో పేలుడు; 10 మంది మృతి | 10 killed in Egypt blast | Sakshi
Sakshi News home page

ఈజిప్టులో పేలుడు; 10 మంది మృతి

Jan 22 2016 10:43 AM | Updated on Apr 3 2019 3:52 PM

ఈజిప్టులోని గిజా ప్రావిన్స్లో గురువారం జరిగిన పేలుడులో కనీసం పదిమంది మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు.

కైరో: ఈజిప్టులోని గిజా ప్రావిన్స్లో గురువారం జరిగిన పేలుడులో కనీసం పదిమంది మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు పోలీసులున్నారు.

ఈజిప్టు రాజధాని కైరో సమీపంలో ఉన్న గిజా ప్రావిన్స్లో ఉగ్రవాద స్థావరంపై భద్రత బలగాలు దాడి చేసినపుడు ఈ పేలుడు సంభవించింది. ఓ అపార్ట్మెంట్లో ఉగ్రవాదులు దాక్కున్నట్టు సమాచారం రావడంతో భద్రత బలగాలు అక్కడికి వెళ్లాయని ఈజిప్టు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి చెప్పారు. గత రెండేళ్లుగా ఈజిప్టులో ప్రభుత్వ వ్యతిరేక దాడులు హెచ్చుమీరాయి. వందలాది మంది పోలీసులు, సైనికులు చనిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement