మీకు మేం అండగా ఉంటాం: వైఎస్‌ జగన్‌

మీకు మేం అండగా ఉంటాం: వైఎస్‌ జగన్‌ - Sakshi


వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్

సాక్షి, హైదరాబాద్: చెన్నైలో వర్షాలు, వరద ముంపుతో విలవిల్లాడుతున్న ప్రజలను ప్రభుత్వాలు, తోటి మానవులు ఇతోధికంగా ఆదుకోవాలని, వారికి సాధ్యమైనంత మేరకు సహాయం అందించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రకృతి సృష్టించిన వరద బీభత్సాన్ని చెన్నైవాసులు మనో నిబ్బరంతో ఎదుర్కొంటున్న తీరు ఆదర్శనీయమని, ఈ క్లిష్ట సమయంలో వారికి తమ సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తున్నామని జగన్ పేర్కొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top