ర్యాలీ నిర్వహించి తీరుతాం | We will conduct rally for sure sayes kodandaram | Sakshi
Sakshi News home page

ర్యాలీ నిర్వహించి తీరుతాం

Feb 21 2017 12:33 AM | Updated on Jul 29 2019 2:51 PM

ర్యాలీ నిర్వహించి తీరుతాం - Sakshi

ర్యాలీ నిర్వహించి తీరుతాం

పోలీసులు, ప్రభుత్వం రెచ్చగొట్టినా శాంతి యుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగానికి లోబడి నిరుద్యోగుల

రేపు డిక్లరేషన్‌ ప్రకటిస్తాం: కోదండరాం
ప్రభుత్వం, పోలీసులు రెచ్చగొట్టినా శాంతియుతంగా ఉండాలి
నిరుద్యోగ యువకులంతా పాల్గొనాలి.. ప్రభుత్వానికి బాధ్యతను గుర్తుచేయాలి


సాక్షి, హైదరాబాద్‌: పోలీసులు, ప్రభుత్వం రెచ్చగొట్టినా శాంతి యుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగానికి లోబడి నిరుద్యోగుల నిరసన ర్యాలీని   నిర్వహిస్తామని టీజేఏసీ చైర్మన్‌  ఎం.కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం ఆయన విలేకరు లతో మాట్లాడారు. ర్యాలీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం ఇప్పటి దాకా అనుమతించకుండా జిల్లాల్లో అరెస్టులకు పాల్పడుతోందన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని అవాంతరాలు కల్పించినా కచ్చితంగా ర్యాలీని నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం, పోలీసులు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా అప్రమత్తంగా వ్యవహరించాలని యువతకు కోదండరాం సూచించారు.

ఎట్టి పరిస్థితుల్లో రెచ్చిపోవద్దని, తెలంగాణ కోసం శాంతియుతంగా పోరా డినట్టే ఇది కూడా జరగాలన్నారు. రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టి, ర్యాలీని శాంతి యుతంగా నిర్వహించే సామర్థ్యం తమకు ఉందన్నారు. ర్యాలీకి ఇప్పటికే 30 విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయని, అనేక యువజన సంఘాలు అండగా ఉంటామని చెప్పినట్టుగా వెల్లడించారు. నిరుద్యోగ యువ కులంతా ర్యాలీలో పాల్గొని, ప్రభుత్వానికి బాధ్యతను గుర్తుచేయాలని పిలుపును ఇచ్చారు. ఫిబ్రవరి 22న డిక్లరేషన్‌ను ప్రకటి స్తామని, దీనికి సంబంధించిన అంశాలపైనా చర్చించామన్నారు. ర్యాలీ, సభకు సంబం ధించిన ఏర్పాట్లపై 15 సబ్‌కమిటీలను ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. వేదిక ప్రాంగణంలో అమరవీరుల స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేస్తామని  చెప్పారు.

ర్యాలీ పూర్తయ్యేదాకా నిద్రపోం
‘‘ర్యాలీని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్ని ఎత్తులు వేసినా నిర్వహించి తీరుతం. పోలీసులను అనుమతించకుంటే ర్యాలీని ఎలా నిర్వహించాలో ఆలోచిస్తం. ర్యాలీ పూర్తయ్యే దాకా నిద్రపోం’’ అని కోదండరాం వ్యాఖ్యా నించారు.  జేఏసీ ఆవిర్భావం తర్వాత ఎన్ని ఉద్యమాలు జరిగాయో, అవన్నీ ఎలా జరి గాయో అందరికీ తెలుసునన్నారు.

ఇంకా నయం.. ఎవరెస్టుపై అనలేదు..
రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో ర్యాలీ చేసుకోవాలని పోలీసులు చేస్తున్న ప్రతి పాదనలపై కోదండరాం ఘాటుగా స్పందిం చారు. ‘‘ఇంకా నయం. ఎవరెస్టుపై చేసుకోమ నలేదు. నిరుద్యోగులు తమ ఆవేదనను ప్రజలకు చెప్పాలని అనుకుం టున్నారు. ప్రజలకు తెలియాలంటే ప్రముఖ ప్రాంతాలను, అనువుగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటారు. నిరుద్యోగ నిరసన ర్యాలీ కూడా అంతే.. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు దాకా ఇప్పటిదాకా ఎన్నో ర్యాలీలు జరిగాయి. అలాగే ఇది కూడా జరుగు తుంది. ఎక్కడో ఊరి బయట చేసుకోమని పోలీసు లంటే ఎలా సమంజసం?’’ అని  జేఏసీ చైర్మన్‌ కోదండరాం ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement