కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఉద్యమంలో పవన్ కల్యాణ్ పాల్గొనాలని కాంగ్రెస్ రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు విజ్ఞప్తి చేశారు.
సాక్షి, హైదరాబాద్: కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఉద్యమంలో పవన్ కల్యాణ్ పాల్గొనాలని కాంగ్రెస్ రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీకి సన్నిహితుడైన పవన్ కల్యాణ్ కాపుల రిజర్వేషన్లపై తక్షణం స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
కాపునాడు బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీహెచ్‌తోపాటు పలువురు కాపు నేతలు మాట్లాడారు. కాపు ఉద్యమకారులపై కేసులు ఎత్తేయాలని, ముద్రగడకు ఏదైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అద్దేపల్లి శ్రీధర్, గాళ్ల సుబ్రహ్మణ్యం నాయుడు, రామిశెట్టి సుబ్బారావు, కఠారి అప్పారావు, పెదకాపు తదితరులు హెచ్చరించారు.