చంద్రబాబు.. మీ పౌరుషం ఏమైంది? | vasireddy padma criticise chandra babu on spaecial status issue | Sakshi
Sakshi News home page

చంద్రబాబు.. మీ పౌరుషం ఏమైంది?

May 7 2016 1:59 PM | Updated on Jul 28 2018 6:51 PM

చంద్రబాబు.. మీ పౌరుషం ఏమైంది? - Sakshi

చంద్రబాబు.. మీ పౌరుషం ఏమైంది?

ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరి తేల్చి చెప్పినా.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరి తేల్చి చెప్పినా.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. హైదరాబాద్ లో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... బీజేపీని విమర్శించొద్దని చంద్రబాబు చెప్పడానికి గల కారణాలేంటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఏపీకి ఇంతకు మించిన నష్టం ఏం జరిగిన తర్వాత బాబు స్పందిస్తారు, మీ పౌరుషం ఏమైంది అంటూ వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి పోరాడుదాం, మీరు సహకరించాలని చంద్రబాబును ఆమె కోరారు. ఏ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారంటూ ఈ సందర్బంగా వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఇప్పటికైనా మీరు నోరు విప్పి వైఎస్ఆర్ సీపీ పోరాటానికి మద్ధతు పలకాలని చంద్రబాబుకు ఆమె సూచించారు. ఉమ్మడి ఉద్యమం చేద్దాం, ప్రత్యేక హోదా సాధిద్దామని ఏపీ సీఎంకు వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మరోసారి పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement