
‘మహా’ ఒప్పందాన్ని సవరించాలి
గోదావరి జలాలకు సంబంధించి మహారాష్ట్రతో.. ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం వల్ల రాష్ట్రానికి తీవ్రనష్టం జరుగుతుందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు టీటీడీపీ ఫిర్యాదు చేసింది.
గవర్నర్‌ను కోరిన టీటీడీపీ... వినతిపత్రం సమర్పణ
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలకు సంబంధించి మహారాష్ట్రతో.. ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం వల్ల రాష్ట్రానికి తీవ్రనష్టం జరుగుతుందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు టీటీడీపీ ఫిర్యాదు చేసింది. త్వరలోనే జరగనున్న అంతర్రాష్ట మండలి సమావేశంలో ఈ ఒప్పందాన్ని సవరించేలా చ ర్యలు తీసుకోవాలని కోరింది. రాజ్‌భవన్‌లో బుధవారం గవర్నర్‌కు టీడీపీ ప్రతినిధి బృందం ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించింది. ప్రాణహితను తమ్మిడిహెట్టి వద్దనే 152 మీటర్ల ఎత్తుతో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే 1,800 ఎకరాల విషయంలో ప్రధాని మోదీతో మాట్లాడి ఒప్పిం చాలని కోరింది.
రాజ్‌భవన్‌లో నిర్వహించే కార్యక్రమాలకు తమకు ఆహ్వానాలు అందడం లేదని, ఎన్నికల సంఘం తమ పార్టీకి గుర్తింపునిచ్చినా గవర్నర్ గుర్తించడం లేదంటూ టీడీపీ నాయకులు సరదాగా వ్యాఖ్యానించారు. దీనిపై గవర్నర్ స్పందిస్తూ టీడీపీ వారంతా వచ్చి తనపై దాడి చేస్తే తనకు రక్షణ ఎవరంటూ రేవంత్‌రెడ్డిని చూపుతూ వ్యాఖ్యానించినట్లు సమాచారం. బృందంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ కమి టీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, ఇతర నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఇ.పెద్దిరెడ్డి, అరికెల నర్సారెడ్డి ఉన్నారు. రైతు ఆత్మహత్యలు, అన్నదాత సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 19, 20 తేదీల్లో ఇందిరాపార్కు వద్ద రైతు దీక్షను చేపడుతున్నట్లు తె లిపారు.