హైకోర్టు విభజన కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ | Transfer of high court division case from Division Bench to SMC | Sakshi
Sakshi News home page

హైకోర్టు విభజన కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ

Jul 28 2016 11:57 AM | Updated on Aug 31 2018 8:26 PM

ఉమ్మడి హైకోర్టు విభజన కేసు విచారణను డివిజన్ బెంచ్.. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన కేసు విచారణను డివిజన్ బెంచ్ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రభుత్వ రివ్యూ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. హైదరాబాద్లోనే రెండు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయాలని టీ.సర్కార్ తన పిటిషన్లో కోరింది. గత తీర్పును పునసమీక్షించాలన్న పిటిషన్పై తీర్పును ఉమ్మడి హైకోర్టు రిజర్వ్లో ఉంచిన విషయం తెలిసిందే. దాంతో  కేసును విచారించిన డివిజన్ బెంచ్.. తాను తీర్పును ప్రకటించలేనని, విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు ప్రకటన చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement