రైల్వే బ్రిడ్జి కింద పసికందు మృతదేహం లభ్యం | The railway bridge is licensed under the babe 's body | Sakshi
Sakshi News home page

రైల్వే బ్రిడ్జి కింద పసికందు మృతదేహం లభ్యం

Jun 30 2016 9:56 PM | Updated on Sep 4 2017 3:49 AM

ఆరేడు నెలల పసికందు మృతదేహం లభ్యమైన ఘటన ఛత్రినాక ఠాణా పరిధిలో గురువారం వెలుగుజూసింది.

చాంద్రాయణగుట్ట: ఆరేడు నెలల పసికందు మృతదేహం లభ్యమైన ఘటన ఛత్రినాక ఠాణా పరిధిలో గురువారం వెలుగుజూసింది. ఎస్‌ఐ షానవాజ్ కథనం ప్రకారం.....ఆర్యమేఘ ఆసుపత్రి సమీపంలోని కందిల్ ఫ్లై రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ఓ పాప మృతదేహం పడి ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి కాళ్లు, చేతులు పూర్తిగా సన్నబడి ఉండడాన్ని బట్టి అనారోగ్యంతో ఆసుపత్రిలో మృతి చెందితే ఎవరో ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. చిన్నారి మెడపై చీమలు కరిచిన ఆనవాళ్లు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement