అదృశ్యమైన చిన్నారులు క్షేమం | The disappearance of the three children in venkatagiri colony | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన చిన్నారులు క్షేమం

May 24 2016 4:31 PM | Updated on Sep 27 2018 5:46 PM

అదృశ్యమైన చిన్నారులు క్షేమం - Sakshi

అదృశ్యమైన చిన్నారులు క్షేమం

మీర్‌పేట పరిధిలోని జిల్లెలగూడ వెంకటగిరి కాలనీలో ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు.

మీర్‌పేట పరిధిలోని జిల్లెలగూడ వెంకటగిరి కాలనీలో ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. కాలనీకి చెందిన శ్రీశైలం(10), రేణుక(8), శివ(7) అనే చిన్నారులు సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చారు. తల్లిదండ్రులు మందలించడంతో భయపడి కనిపించకుండా పోయారు. రాత్రి అయినా కనపడకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా..దూల్‌పేట్ పరిధిలోని అల్మాస్‌గూడలో ఉంటున్న వారి పెద్దమ్మ దగ్గరకు వెళ్లినట్లుగా కనుగొన్నారు. వారిని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement