'తెలంగాణ మతసామరస్యానికి ప్రతీక' | Telangana state a sign of communal harmony, says KCR | Sakshi
Sakshi News home page

'తెలంగాణ మతసామరస్యానికి ప్రతీక'

Sep 16 2016 8:23 PM | Updated on Aug 15 2018 9:35 PM

'తెలంగాణ మతసామరస్యానికి ప్రతీక' - Sakshi

'తెలంగాణ మతసామరస్యానికి ప్రతీక'

తెలంగాణ రాష్ట్రం మతసామరస్యానికి ప్రతీక' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

హైదరాబాద్: 'తెలంగాణ రాష్ట్రం మతసామరస్యానికి ప్రతీక'' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో గురుకుల పాఠశాలల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలు మరోసారి మతసామరస్యాన్ని నిరూపించాయని అన్నారు. బతుకమ్మ, దసరా, పీర్ల పండగలను కలిసి చేసుకునే సంస్కృతి తెలంగాణది'' అని తెలిపారు. అన్ని మతాలవారు కలిసిమెలిసి జీవించి బాగుండాలని కోరుకుంటున్నానని కేసీఆర్ చెప్పారు.

అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం నాటికి తెలంగాణలో 160 మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గురుకులాల్లో 55 వేల మంది మైనార్టీ విద్యార్థులకు విద్యా బోధన తరగతులు నిర్వహించనున్నట్టు కేసీఆర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement