తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీపీఐ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు.
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీపీఐ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. సురవరం లేఖలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తుది కసరత్తు చేస్తున్నట్లు తెలిసిందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
జిల్లాల ఏర్పాటుపై సహజంగానే ప్రజల నుంచి అభ్యర్ధనలు వస్తాయని చెప్పిన సురవరం.. గద్వాల, జనగామలను జిల్లాలుగా చేయాలనే ప్రజల వాదనల గురించి ప్రస్తావించారు. ఈ రెండు కోర్కెలు సమంజసమైనవేనని తాను భావిస్తున్నట్లు చెప్పారు. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య భాగమైన నడిగడ్డకు కేంద్రంగా గద్వాలను చేయడం సబబేనని లేఖలో పేర్కొన్నారు. జనగామ పెద్ద మున్సిపల్ నగరమే కాక, అందరికీ అందుబాటులో ఉండే నగరం. ఈ రెండింటిని జిల్లాలుగా చేయడంపై సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నానని ఆయన రాశారు.