ఆంధ్రా యూనివర్సిటీలోని తెలుగు శాఖ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకులు సోమవారం ఆందోళనకు దిగారు.
విశాఖపట్టణం: ఆంధ్రా యూనివర్సిటీలోని తెలుగు శాఖ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకులు సోమవారం ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అధ్యయన కేంద్రాన్ని వదిలి కేవలం హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న యూనివర్సిటీకి మాత్రమే అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేయటాన్ని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం తీవ్రంగా వ్యతిరేకించింది.
నోటిఫికేషన్ విడుదలయి రెండు రోజులైనా ఏపీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని విద్యార్థి సంఘం నాయకులు విమర్శించారు. తెలుగు ప్రజలను అవమానించే విధంగా నోటిఫికేషన్ ఉందంటూ కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. తక్షణమే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ఏపీలో ఉన్న తెలుగు యూనివర్సిటీ అనుబంధ కేంద్రాలతో పాటు రాజమండ్రి కేంద్రంగా తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.