'తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలి'
పాతబస్తీలో ఎంఐఎం, కొత్తసిటీలో టీఆర్ఎస్ పార్టీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, ఇతర పార్టీల అభ్యుర్ధులపై దాడి ఇందుకు నిదర్శనమని అఖిలపక్ష నేతలు జానారెడ్డి, లక్ష్మణ్, ఎల్ రమణ, శివకుమార్ పేర్కొన్నారు.
	హైదరాబాద్: పాతబస్తీలో ఎంఐఎం, కొత్తసిటీలో టీఆర్ఎస్ పార్టీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, ఇతర పార్టీల అభ్యుర్ధులపై దాడి ఇందుకు నిదర్శనమని అఖిలపక్ష నేతలు జానారెడ్డి, లక్ష్మణ్, ఎల్ రమణ, శివకుమార్ ధ్వజమెత్తారు. మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం కార్యకర్తలను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. శాంతి భద్రతల అదుపులో ప్రభుత్వం విఫలమైందన్నారు.
	
	తక్షణం గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని సెక్షన్ 8 అమలు చేయాలన్నారు. హైదరాబాద్లో శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ లను కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరిస్తామని అఖిలపక్ష నేతలు జానారెడ్డి, లక్ష్మణ్, ఎల్ రమణ, శివకుమార్ తెలిపారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
