మురళీమోహన్ తనయుడి ఇంట్లో మళ్లీ చోరీ | Second time robbery in murali mohan' sons house | Sakshi
Sakshi News home page

మురళీమోహన్ తనయుడి ఇంట్లో మళ్లీ చోరీ

Feb 8 2015 1:55 PM | Updated on Aug 30 2018 5:27 PM

చోరీ జరిగిన తీరును పరిశీలిస్తున్న అధికారులు - Sakshi

చోరీ జరిగిన తీరును పరిశీలిస్తున్న అధికారులు

రాజమండ్రి ఎంపీ, నటుడు, నిర్మాత మురళీమోహన్ తనయుడు మాగంటి రామ్మోహన్ ఇంట్లో వారంలో వరుసగా రెండు సార్లు చోరీ జరిగింది.

బంజారాహిల్స్:  రాజమండ్రి ఎంపీ, నటుడు, నిర్మాత మురళీమోహన్ తనయుడు మాగంటి రామ్మోహన్ ఇంట్లో వారంలో వరుసగా రెండు సార్లు చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇటీవల మురళీమోహన్ కుటుంబ స్నేహితురాలు శ్రీలంక నుంచి ఓ పెళ్లికి హాజరయ్యేందుకు నగరానికి వచ్చి రామ్మోహన్ ఇంట్లో బస చేసింది. ఆమె తిరిగి శ్రీలంక వెళ్లే రోజున బ్యాగులోని రూ.6 లక్షల విలువైన నగలు, విదేశీ కరెన్సీ  చోరీ జరిగింది.

ఆ కేసు దర్యాప్తు జరుగుతుండగానే మళ్లీ ఖరీదైన టీవీని ఆగంతకులు దొంగిలించారంటూ రామ్మోహన్ శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, డీఐ రాంబాబు ఆధ్వర్యంలో డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీమ్‌తో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఘటనా స్థలికి వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు కూడా వచ్చారు. ఇప్పటికే రామ్మోహన్ ఇంట్లో వంట మనిషి, పని మనుషులు, డ్రైవర్‌తో పాటు ఏడుగురిని పోలీసులు విచారించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement