15 నుంచి ‘సాక్షి ఎడ్జ్‌’ ఆధ్వర్యంలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ | Sakhi edge to start spoken english training | Sakshi
Sakshi News home page

15 నుంచి ‘సాక్షి ఎడ్జ్‌’ ఆధ్వర్యంలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ

Jun 13 2017 2:13 AM | Updated on Aug 20 2018 8:20 PM

ఏ భాషలోనైనా మన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేయాలంటే చక్కటి నైపుణ్యం ఉండాలి.

సాక్షి, హైదరాబాద్‌: ఏ భాషలోనైనా మన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేయాలంటే చక్కటి నైపుణ్యం ఉండాలి. ఇంగ్లిష్‌లో అలాంటి ప్రావీణ్యాన్ని సంపాదించేందుకు ‘సాక్షి ఎడ్జ్‌’ ఆధ్వర్యంలోని స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ దోహదం చేస్తుంది. మీలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, ఇంగ్లిష్‌పై పట్టు సాధించే దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది. ఇంగ్లిష్‌ నేర్చుకోవాలనే తపన ఉన్న వారికి ‘సాక్షి ఎడ్జ్‌’ వినూత్నమైన శిక్షణ అందజేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విజేతలుగా నిలుపుతుంది. ఈ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సులో భాషా పరిచయంతో పాటు, ఉచ్చారణలో దొర్లే తప్పులు, ఫ్లూయన్సీ లింకింగ్‌ను అధిగమించడం, గ్రామర్‌ వంటి ముఖ్య అంశాలలో శిక్షణనిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తారు.

కాల పరిమితి: జూన్‌ 15వ తేదీ నుంచి 30 రోజుల పాటు
వేళలు: సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు
కోర్సు ఫీజు: రూ. 4,600
రిజిస్ట్రేషన్లు, తరగతులు: సాక్షి ప్రధాన కార్యాలయం, సాక్షి టవర్స్, రోడ్‌ నంబర్‌–1, కేర్‌ ఆస్పత్రి సమీపంలో, బంజారాహిల్స్, హైదరాబాద్‌
వివరాలకు: ఫోన్‌ నంబర్‌ 9603533300 (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు)లో లేదా sakshiedge@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement