తెలంగాణ సచివాలయంలో చోరీ | robbery in telangana secretariat | Sakshi
Sakshi News home page

తెలంగాణ సచివాలయంలో చోరీ

Oct 19 2015 12:34 PM | Updated on Aug 30 2018 5:27 PM

తెలంగాణ సచివాలయంలో చోరీ - Sakshi

తెలంగాణ సచివాలయంలో చోరీ

తెలంగాణ సచివాలయంల చోరీ జరిగింది. సచివాలయంలోని డీ బ్లాక్ సమీపంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ జనరేటర్ బ్యాటరీని ఎత్తుకెళ్లారు.

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంల చోరీ జరిగింది. సచివాలయంలోని డీ బ్లాక్ సమీపంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ జనరేటర్ బ్యాటరీని ఎత్తుకెళ్లారు. సోమవారం గుర్తించిన సిబ్బంది సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సచివాలయంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అనుమతి లేకుంగా ప్రవేశిరచడం సాధ్యం కాదు. అయినా సెక్రటేరియట్ లో దొంగతనం జరగడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే సచివాలయంలోకి బయటి వ్యక్తులు వచ్చారా, లేక లోపలి పనిచేసే సిబ్బందే ఈ చోరికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇందుకోసం సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement