
చొక్కాలు విప్పించి.. మోకాళ్లపై కూర్చొబెట్టి..
నగరంలోని జేఎన్‌టీయూలో ర్యాగింగ్ కలకలం రేపింది. జేఎన్‌టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు
జేఎన్‌టీయూహెచ్‌లో ర్యాగింగ్ కలకలం
హైదరాబాద్: నగరంలోని జేఎన్‌టీయూలో ర్యాగింగ్ కలకలం రేపింది. జేఎన్‌టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సివిల్ ఇంజనీ రింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆవోతు రాఘవేందర్, జశ్వంత్‌లను సెకం డియర్ విద్యార్థులు నిర్భయ్, సారుుసూర్య తేజలు హాస్టల్‌కు తీసుకువెళ్లి చొక్కాలు విప్పించి మోకాళ్ల మీద కూర్చొబెట్టించారు. నిరాకరించిన రాఘవేందర్ చెంపపై కొట్టారు. అరగంటపాటు వారిని వేధింపులకు గురిచేశారు. రాత్రి భోజనం అనంతరం హాస్టల్ కన్వీనర్ సీనియర్ విద్యార్థ్ధు లను పిలిచి మందలించి క్షమాపణలు చెప్పించా రు. బుధవారం ఉదయం ర్యాగింగ్ విషయం వాట్సాప్, విద్యార్థి సంఘాల ద్వారా బయటకు పొక్కడం, టీవీల్లో స్క్రోలింగ్ రావడంతో కేపీహెచ్‌బీ సీఐ కుశాల్కర్ జేఎన్‌టీయూహెచ్‌కు చేరుకొని విచారణ చేపట్టారు.
ప్రిన్సిపల్ గోవర్ధన్‌తోపాటు బాధిత విద్యార్థ్ధి రాఘవేందర్ ను విచారించి ఫిర్యాదు తీసుకున్నారు. నిందితు లను కూడా విచారించారు. క్షమాపణలు చెప్పిం చినా విద్యార్థి సంఘాల నాయకులు రచ్చ చేస్తు న్నారని బీటెక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిందితులను శిక్షించాలంటూ టీఆర్‌ఎస్‌వీ, తెలం గాణ జాగృతి సంఘాల ప్రతినిధులు ఇంజనీరింగ్ కళాశాల ఎదుట ధర్నా చేశారు. బీటెక్ విద్యార్థు లు ప్రతి నినాదాలు చేస్తూ బైఠారుుంచారు. దీంతో ఇరువర్గాల నడుమ వాగ్వాదం చోటు చేసుకోగా సీఐ జోక్యం చేసుకొని ఇరువర్గాలను సముదారుుంచారు.
విచారణ జరుపుతున్నాం...
జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారనే విష యమై ర్యాగింగ్ నిరోధక కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నామని కమిటీ నివేదిక ఆధా రంగా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ గోవర్ధన్ తెలిపారు. ర్యాగింగ్‌కు తావు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు.