
పవన్.. తెలుసుకొని మాట్లాడు: ఆర్.కృష్ణయ్య
కాపులను బీసీలో కలుపుతామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు వ్యతిరేకించని ఆర్.కృష్ణయ్య.. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు.
సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీలో కలుపుతామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు వ్యతిరేకించని ఆర్.కృష్ణయ్య.. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు.
కాపులను బీసీలో కలుపుతామని 1994లో ఒక జీవో జారీ చేస్తే దానిపై హైకోర్టుకు వెళ్లామని, ఆ జీవోను హైకోర్టు కొట్టేసిన విషయం పవన్ కల్యాణ్ తెలుసుకొని మాట్లాడాలన్నారు. అదేవిధంగా 1998, 2000 సంవత్సరంలో జాతీయ కమిషన్ వచ్చినప్పుడూ అడ్డుకున్నామని గుర్తుచేశారు. కాపులను బీసీలో కలపడం అంటే ఒక పులి, ఒక ఎద్దుతో నాగలి కట్టడమేనన్నారు. కాపులను బీసీ జాబితాలో కలపాలంటే కొన్ని అర్హతలుండాలని వివరించారు.