ఇక భార్యాభర్తలకు ఒకచోట పోస్టింగ్! | Posting of husband and wife at the same station in telangana state in soon | Sakshi
Sakshi News home page

ఇక భార్యాభర్తలకు ఒకచోట పోస్టింగ్!

Mar 26 2016 8:17 PM | Updated on Jul 27 2018 2:26 PM

రాష్ట్రంలో భార్య ఒకచోట.. భర్త ఒకచోట పని చేసే ప్రభుత్వ ఉద్యోగస్తులకు తెలంగాణ సర్కార్ త్వరలో తీపి కబురు అందించనుంది.

హైదరాబాద్ : రాష్ట్రంలో భార్య ఒకచోట.. భర్త ఒకచోట పని చేసే ఉద్యోగస్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించనుంది. ఉద్యోగులైన భార్యాభర్తల బదిలీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీఎన్జీవోల నుంచి విజ్ఞప్తుల మేరకు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలకు ఒకచోట పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సముఖత వ్యక్తం చేసింది.

 

వాస్తవానికి వేర్వేరు చోట్ల పనిచేస్తున్న ఉద్యోగ దంపతుల వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. కాగా ఉద్యోగులైన భార్యాభర్తలకు సంబంధించి ఇద్దరూ ఒకే చోట పనిచేసేలా బదిలీ చేయాల్సిన క్రమంలో ఓ విధాన నిర్ణయాన్ని తీసుకోవాలని గతంలో కమలనాథన్‌ కమిటీ కూడా ప్రభుత్వానికి సూచనలు చేసిన విషయం తెలిసిందే. దీంతో త్వరలో బదిలీల ప్ర్రక్రియ ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement