శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై గత అర్థరాత్రి అతివేగంతో వెళ్తున్న ఓ లారీ డివైడర్ ను ఢీ కొట్టింది.
శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై గత అర్థరాత్రి అతివేగంతో వెళ్తున్న ఓ లారీ డివైడర్ను ఢీ కొట్టింది. దాంతో ట్రాఫిక్ను నియంత్రిస్తున్న కానిస్టేబుల్పైకి మరో లారీ దూసుకువచ్చింది. ఆ ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబులు మృతి చెందాడు. లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్నవాహనదారులు వెంటనే స్పందించి లారీ డ్రైవర్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.