కార్డన్ సెర్చ్‌: 50 ద్విచక్రవాహనాలు స్వాధీనం | police conducted cordon search operation at chandrayangutta | Sakshi
Sakshi News home page

కార్డన్ సెర్చ్‌: 50 ద్విచక్రవాహనాలు స్వాధీనం

Feb 27 2017 9:30 AM | Updated on Sep 5 2017 4:46 AM

చంద్రాయణగుట్ట ప్రాంతంలో సోమవారం వేకువజామున పోలీసులు నిర్భంధ తనిఖీలు చేపట్టారు

హైదరాబాద్: పాతబస్తీ, చంద్రాయణగుట్ట ప్రాంతంలో సోమవారం వేకువజామున పోలీసులు నిర్భంధ తనిఖీలు చేపట్టారు. దక్షిణ మండల డీసీపీ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు తనిఖీలు నిర‍్వహించారు.

ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 50 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో 90 మద్యం సీసాలు పట్టుబడ్డాయి. పోలీసులు 11 మంది రౌడీషీటర్లు, 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement