స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోని మరో మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంతభవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది.
-రూ.1.89కోట్లు మంజూరు చేస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోని మరో మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంతభవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు రూ.1.89కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట్, నల్గొండ జిల్లాలోని భువన గిరి, యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణం కోసం ఒక్కో భవనానికి రూ.63లక్షలు ప్రభుత్వ కేటాయించింది. నిధుల వినియోగానికి సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను సర్కారు ఆదేశించింది.