మద్యం మత్తులో కత్తితో దాడి | one injured in man attacks with knife | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో కత్తితో దాడి

Jan 10 2017 12:42 PM | Updated on Aug 1 2018 2:31 PM

మద్యం మత్తులో స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని "డి"కాలనిలో సోమవారం అర్ద రాత్రి చోటుచేసుకుంది.

హైదరాబాద్: మద్యం మత్తులో స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని "డి"కాలనిలో సోమవారం అర్ద రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా ఉంటున్న ముగ్గురు వ్యక్తులు సోమవారం రాత్రి మద్యం సేవించారు. అనంతరం క్రికెట్‌ బెట్టింగ్‌ కాశారు. ఈ నేపధ్యంలో దేవేందర్‌(30) అనే వ్యక్తిపై యూసుఫ్‌ కత్తితో దాడి చేశాడు. దీంతో అతనికి ఛాతిపై గాయాలయ్యాయి. గాయపడిన దేవేందర్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. నిందితుడు యూసుఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ దేవేందర్‌ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement