గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కందాలపై వేసుకొని గడిచిన మూడు వారాల నుంచి నిర్విరామ ప్రచారం చేసి గ్రేటర్‌పై గులాబీజెండా ఎగురవేస్తామని ధీమాగా ఉన్న మంత్రి కేటీఆర్..
బంజారాహిల్స్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కందాలపై వేసుకొని గడిచిన మూడు వారాల నుంచి నిర్విరామ ప్రచారం చేసి గ్రేటర్‌పై గులాబీజెండా ఎగురవేస్తామని ధీమాగా ఉన్న మంత్రి కేటీఆర్ సతీమణికి ఓటు లేకపోవడం చర్చనీయాంశం అయ్యింది. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని నందినగర్‌లో మంత్రి కేటీఆర్ నివసిస్తారు. ఆయనకు ఇక్కడే ఓటు ఉంది. అయితే ఆయన భార్య శైలిమకు మాత్రం ఓటు లేదు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమెకు ఓటు లేదని ఎన్నికల సిబ్బంది పేర్కొంటున్నారు. ఆమెకు ఓటు ఎందుకు లేదన్నది అంతుబట్టకుండా ఉంది. స్వగ్రామంలో కూడా ఆమెకు ఓటు లేదని సమాచారం. ఇదిలా ఉండగా ఇంత వరకు కేటీఆర్‌కు జీహెచ్‌ఎంసీ సిబ్బంది పోలింగ్ స్లిప్‌లు పంపిణీ చేయలేదు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆయనకు పోలింగ్ స్లిప్ పంపిణీ చేయకపోవడం గమనార్హం.