
కొందరు ఇబ్బంది పెడుతున్నందునే ....
కొందరు ఇబ్బంది పెడుతున్నందునే పార్టీని వీడాలనుకున్నానని పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అన్నారు.
హైదరాబాద్ : కొందరు ఇబ్బంది పెడుతున్నందునే పార్టీని వీడాలనుకున్నానని పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అన్నారు. ఆయన సోమవారం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా పొన్నాల సమక్షంలో ఆయన మీడియాకు తెలిపారు.
కాంగ్రెస్ తనకు కన్నతల్లిలాంటిదని నందీశ్వర్ గౌడ్ తెలిపారు. తెలంగాణకు బీసీనే ముఖ్యమంత్రిని చేయాలని ఆయన అన్నారు. చిత్తశుద్ధితో పని చేసేవారిని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలని నందీశ్వర్ గౌడ్ సూచించారు. పొన్నాల తనకు అండగా ఉంటానని హామీ ఇచ్చారన్నారు.