'కేసీఆర్.. ఖాసీం రజ్వీ వారసుడు' | nagam janardhan reddy takes on kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్.. ఖాసీం రజ్వీ వారసుడు'

Sep 17 2016 10:45 AM | Updated on Aug 15 2018 9:35 PM

'కేసీఆర్.. ఖాసీం రజ్వీ వారసుడు' - Sakshi

'కేసీఆర్.. ఖాసీం రజ్వీ వారసుడు'

ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ నాయకుడు నాగం జనార్దన్రెడ్డి నిప్పులు చెరిగారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ నాయకుడు నాగం జనార్దన్రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ ఖాసీం రజ్వీ వారసుడుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శనివారం నగరంలోని అసెంబ్లీకి ఎదురుగా ఉన్న సర్దార్ వల్లబాయి పటేల్ విగ్రహానికి నాగం జనార్దన్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ వేడుకల్లో పాల్గొన్న నాగం జనార్దన్రెడ్డి మాట్లాడుతూ... ఖాసీం రజ్వీ వారసులకు భయపడి విమోచన దినం అధికారంగా నిర్వహించడం లేదని కేసీఆర్పై మండిపడ్డారు. హైదరాబాద్ సంస్థానాన్ని దక్కన్ పాకిస్థాన్గా మార్చాలనుకున్న నిజాం ఆలోచనలను నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ పోలీస్ చర్యల ద్వారా అడ్డుకున్నారని ఈ సందర్బంగా నాగం జనార్దన్రెడ్డి గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement