‘బాలలతో పనులు చేయిస్తే ఊరుకోం’ | minister nayani narasimha reddy attended child labour program | Sakshi
Sakshi News home page

‘బాలలతో పనులు చేయిస్తే ఊరుకోం’

Dec 21 2016 4:17 PM | Updated on Sep 4 2017 11:17 PM

బాల కార్మిక నిర్మూలన కోసం యుద్ధం మొదలైందని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు.

హైదరాబాద్: బాల కార్మిక నిర్మూలన కోసం యుద్ధం మొదలైంది. కార్మిక శాఖతో పాటు అన్ని శాఖలు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఇకపై బాలలతో పనులు చేయిస్తే ఊరుకునేది లేదు. సమాచారం ఇస్తే చాలు దాడులు చేసి జైలుకు పంపుతాం.. అని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన బాలకార్మిక నిర్మూలన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లల్ని పనుల్లో పెట్టుకోవడంతో పాటు వారిని హింసిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఆకస్మిక దాడులు నిర్వహించి యజమానులపై కేసులు నమోదుచేసి బాలలకు విముక్తి కలిగిస్తున్నామని చెప్పారు. అలాంటి దాడుల్లో గుర్తించిన చిన్నారులకు ప్రభుత్వమే ఉచిత విద్యనందించి వసతి కల్పిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement